No. of Views : 6
cs somesh kumar speech about migrant workers

రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు గారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రం నుండి శనివారం వివిధ రైల్వే స్టేషన్ ల నుండి దాదాపు 50 వేలమంది వలస కార్మికులను వివిధ రాష్ట్రాలకు తరలించినట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. ఒకే రోజు రికార్డ్ స్థాయిలో 40 రైళ్ల ద్వారా ఇంతమంది వలస కార్మికులను ఆయా రాష్ట్రాలకు తరలించే ప్రక్రియను సాఫీగా పూర్తిచేసినందుకు డీజీపీ మహేందర్ రెడ్డి, రైల్వే తదితర అధికారులకు సోమేశ్ కుమార్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఇప్పటివరకు రాష్ట్రంనుండి 124 రైళ్ల ద్వారా 1 .58 లక్షల మంది వలస కార్మికులను వారి వారి రాష్ట్రాలకు తరలించామని , ఇందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం రూ. 13 .15 కోట్లను వ్యయం చేసిందని వివరించారు. రాష్ట్రంలో వెస్ట్ బెంగాల్ రాష్ట్రం మినహా వివిధ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికుల తరలింపు దాదాపు పూర్తి అయిందని సోమేశ్ కుమార్ అన్నారు.

వెస్ట్ బెంగాల్ లో అక్కడి పరిస్థితులు చక్క బడంగానే ఆ రాష్ట్రం వలస కార్మికులను ఒకటి రెండు రోజుల్లోనే పంపడానికి 10 రైళ్లను సిద్ధాంగా ఉంచామని అన్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు ఇంకా మిగిలి ఉంటే వారిని కూడా పంప డానికి ఒకటి లేదా రెండు రైళ్ల ద్వారా పంపేందుకై చర్యలను చేపట్టామని తెలిపారు. వలస కార్మికులను ఇంటివద్దనుండి బస్సులను ఏర్పాటు చేసి రైల్వే స్టేషన్లకు తరలించి, ఒక్కో కార్మికునికి రెండు ఆహార ప్యాకెట్లు, మూడు లీటర్ల మంచినీరు, పండ్లను ప్రభుత్వ ఖర్చుతో అందింస్తున్నామని సి.ఎస్. వివరించారు.

తెలంగాణా ప్రభుత్వం తన స్వంత ఖర్చుతోనే వలస కార్మికులను తరలించిందని అన్నారు. ఒకేరోజు 40 రైళ్ల ద్వారా 50 వేలమంది వలస కార్మికులను సాఫీగా తరలించేందుకై కృషి చేసిన రవాణా శాఖ ముఖ్య కారదర్శి సునీల్ శర్మ, నోడల్ అధికారులు సందీప్ కుమార్ సుల్తానియా,అడిషనల్ డీజీ జితేందర్,పోలీసు కమీషనర్లు అంజనీ కుమార్, మహేష్ భగవత్ , వీసీ సజ్జనార్ , కలెక్టర్లు ,అనితా రామచంద్రన్, శ్వేతా మహంతి , అమయ్ కుమార్, వెంకటేశ్వర్లు , హనుమంత రావు లకు , రైల్వే శాఖకు సి.ఎస్ ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు. కాగా, రాష్ట్రంలోని వలస కార్మికుల తరలింపులో ఏ విధమైన ఇబ్బందులు ఎదురుకాకుండా పకడ్బందీప్రణాళికలు రూపొందించి రైల్వే తోసహా వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమన్వయం చేసి తరలింపు పక్రియను సాఫీగా నిర్వర్తించడం, అధికారులకు ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ విజయం సాధించారు..