No. of Views : 7
Coronavirus Positive Cases in Telangana

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఆదివారం 41 మందికి కరోనా పాజిటివ్‍గా నిర్ధారణ అయ్యింది. వీరిలో 23 మంది జీహెచ్‍ఎంసీ పరిధిలోనివారు కాగా, రంగారెడ్డి జిల్లావారు ఒకరు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 11 మంది, విదేశాల నుంచి వచ్చినవారు ఆరుగురు ఉన్నారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,854కు చేరింది. ఆదివారం వైరస్‍ ప్రభావం తీవ్రంగా ఉన్న నలుగురు మృత్యువాతపడగా, చికిత్స ద్వారా కోలుకొన్న 24 మంది డిశ్చార్జి అయ్యారని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ  పేర్కొన్నది. రాష్ట్రానికి దేశ, విదేశాల నుంచి వస్తున్నవారిలో వైరస్‍ వెలుగుచూస్తుండటంతో వైద్యారోగ్యశాఖ అప్రమత్త చర్యలు చేపట్టింది.