No. of Views : 15
us-official-renews-calls-for-north-korea-to-abandon-nukes

ఉత్తర కొరియాతో అణు నిరాయుధీకరణపై నిలిచిపోయిన చర్చలను అమెరికా మళ్లీ తెరమీదకి తెచ్చింది. గొప్ప ఆర్థిక వ్యవస్థ గా ఎదగాలంటే ఆణ్వస్త్ర ప్రయోగాల నుంచి దూరం జరగాలంటూ అమెరికా జాతీయ భద్రతా సలహాదారు ఓబ్రియెన్‍ తాజాగా ఉత్తర కొరియాతో సంప్రదింపులు మొదలు పెట్టారు. ఇటీవల 20 రోజుల తర్వాత తొలిసారి ఓ బహిరంగ సభలో పాల్గొన్న ఉత్తర కొరియా అధినేత కిమ్‍ జోంగ్‍ ఉన్‍ కొరియా అణ్వస్త్ర సామర్ధ్యాన్ని పెంచుతానంటూ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే అమెరికా మళ్లీ చర్చలు మొదలు పెట్టడం గమనార్హం. 2018లో అమెరికాతో అణునిరాయుధీకరణపై చర్చలు జరిగిన తర్వాత ఉత్తర కొరియా అణ్వస్త్ర సామర్థ్యాన్ని ప్రస్తావిచడం ఇదే తొలిసారి. అంతర్జాతీయ ఆంక్షల కారణంగా ఉత్తరకొరియా ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా నష్టపోవడంతో పాటు, కరోనా మహమ్మారి వల్ల చైనాతో వాణిజ్యం కూడా భారీగా క్షీణించింది.