No. of Views : 21
Trump stops hyping hydroxychloroquine

కరోనా వైరస్‍ ముప్పు నుంచి తప్పించుకోవడానికి తాను తీసుకున్న హైడ్రాక్సీక్లోరోక్విన్‍ (హెచ్‍సీక్యూ)ను వాడడం ఆపేసినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‍ తెలిపారు. ఈ యాంటీ మలేరియా మందును రెండు వారాల పాటు తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం తాను ఆరోగ్యంగా ఉన్నానని, హెచ్‍సీక్యూ వాడిన లక్ష్యం నెరవేరిందని చెప్పుకొచ్చారు. ఈ ఔషధం వల్ల దుష్ప్రభావాలు ఉంటాయని అనేక మంది హెచ్చరించినప్పటికీ, ట్రంప్‍ మాత్రం వెనకడుగు వేయలేదు. ఇప్పటికీ కరోనా చికిత్సలో హెచ్‍సీక్యూ వాడకాన్ని సమర్థిస్తున్నారు.