No. of Views : 5
Bandi Sanjay Meets Pawan Kalyan

హిందువులు గర్జిస్తే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల చెవుల్లో రక్తం కారి పారిపోతారని బీజేపీ  తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‍ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందువల సహనాన్ని పిరికితనంగా భావించవద్దని హెచ్చరించారు. తెలంగాణను ఇస్లాం ర్యాంగా, ఏపీని క్రైస్తవ రాజ్యంగా మార్చేందుకు కేసీఆర్‍, జగన్‍ ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇతర మతాల ప్రార్థనా మందిరాల జోలికి వెళ్లే ధైర్యముందా? అని జగన్‍కు సవాల్‍ చేశారు. అయోధ్య రామ మందిరాన్ని కాపాడుకున్నట్టే తిరుపతిని కాపాడుకుంటామని ప్రకటించారు. జనసేన అధినేత పవన్‍ కల్యాణ్‍తో బండి సంజయ్‍ సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్లోని పవన్‍ ప్రొడక్షన్‍ ఆఫీసులో గంటపాటు భేటీ జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ పరిస్థితులు, టీటీడీ ఆస్తుల విక్రయం, పోతిరెడ్డిపాడు తదితర అంశాలపై చర్చించారు. మోదీ అంటే తనకు అభిమానమని పవన్‍ వ్యాఖ్యానించినట్లు సమచారం.