No. of Views : 16
China raises US trade tensions with warning of new cold war

అమెరికా-చైనా మధ్య మళ్లీ వాణిజ్య యుద్దం రాజుకుంటోంది. మరో 33 చైనా కంపెనీలు, చైనా ప్రభుత్వ రంగ సంస్థలపై ట్రంప్‍ సర్కార్‍ ఎగుమతి ఆంక్షలు విధించింది. ఇందులో యాంటీ వైరస్‍ సాఫ్ట్వేర్‍, వెబ్‍ బ్రౌజర్లు సరఫరా చేసే కిహు 360, ఇంటర్నెట్‍ ఆధారిత రోబోలు తయారు చేసే క్లౌడ్‍మైండ్స్ టెక్నాలజీ అనే కంపెనీలు ఉన్నాయి. చైనా అధికారికంగా దీనిపై ఇంకా స్పందించలేదు. అయితే ఈ కంపెనీలు మాత్రం అమెరికాపై నిప్పులు గక్కాయి. దేశ భద్రత పేరుతో ట్రంప్‍ సర్కారు వాణిజ్యాన్ని రాజకీయం చేస్తోందని విమర్శించాయి. అమెరికా ఇప్పటికే చైనాకు చెందిన ప్రముఖ టెక్నాలజీ కంపెనీ హువేపై దేశ భద్రత పేరుతో వాణిజ్య ఆంక్షలు విధించింది. చైనా దీనిపై మండిపడింది.