No. of Views : 37
India moves into top 10 worst hit by COVID 19

కరోనా విశ్వమారి బారిన పడిన విలవిలలాడుతున్న టాప్‍- 10 దేశాల్లో భారత్‍ కూడా చేరింది. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు 24 గంటల్లో కొత్తగా 6,977 పాజిటివ్‍ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,38,845కు చేరుకున్నది. వారం రోజులుగా రికార్డు స్థాయిలో కేసులు నమోదు కావడంతో వైరస్‍ బారిన పడిన 10 దేశాల జాబితాలో భారత్‍ చేరింది. గత సోమవారం 5,242 కేసులు నమోదైతే, బుధవారం 5611, శుక్రవారం 6088, శనివారం 6,654, అధివారం 6,767 కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కొత్తగా 154 మంది మృతి చెందడంతో దేశ్యాప్తంగా మొత్తం మరణాల సంఖ్య 4,027కు చేరుకున్నది. వైరస్‍ కేసుల పరంగా అమెరికా మొదటి స్థానంలో ఉండగా, తర్వాతి స్థానంలో బ్రెజిల్‍ నిలిచింది. చైనా ప్రస్తుతం 14వ స్థానానికి పడిపోయింది.