No. of Views : 19
Advocate Gokul Rama Rao will become the member of Telangana State Bar Council

తెలంగాణ రాష్ట్ర బార్‍ కౌన్సిల్‍ సభ్యుడిగా గోకుల్‍ రామారావు బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం బార్‍ కౌన్సిల్‍ సభ్యుడిగా ఉన్న ఎన్‍.హరినాథ్‍ రెడ్డి ఆంధప్రదేశ్‍ హైకోర్టులో సహాయ సొలిసిటర్‍ జనరల్‍గా నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ హైకోర్టులో ఆయన బాధ్యతలు స్వీకరించినందున బార్‍ కౌన్సిల్‍ సభ్యత్వ పోస్టుకు రాజీనామా చేయడంతో పాటు ఎన్‍రోల్‍మెంట్‍నూ అక్కడికే బదలాయించుకుంటున్నారు. దీనికి బార్‍ కౌన్సిల్‍ చైర్మన్‍ ఎ.నరసింహారెడ్డి ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఆయన రాజీనామాను చైర్మన్‍ ఆమోదించిన అనంతరం ఖాళీ అయ్యే పోస్టులో.. హరినాథ్‍రెడ్డి తర్వాతి స్థానంలో ఉన్న గోకుల్‍ రామారావు బార్‍ కౌన్సిల్‍ సభ్యుడిగా ఎంపిక కానున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి బార్‍ కౌన్సిల్‍ తీర్మానం లాంఛనమే కానుంది.