No. of Views : 6
IT industry will grow after Covid crisis, says KT Rama Rao

తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్‍లో ఐటీరంగానికి ఉన్న సానుకూలత దృష్ట్యా కరోనా సంక్షోభంలో కూడా ఐటీ  పరిశ్రమ తిరిగి అభివృద్ధిబాట పడుతుందని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు విశ్వాసం వ్యక్తంచేశారు. తెలంగాణ ఐటీ పరిశ్రమ అభివృద్ధి భవిష్యత్తులోనూ కొనసాగుతుందని చెప్పారు. హైదరాబాద్‍ సాఫ్ట్‌వేర్‌ ఎంటర్‍ప్రైజెస్‍ అసోసియేషన్‍ (హైసీయా) నూతన కార్యవర్గం ప్రగతిభవన్‍లో మంత్రి కేటీఆర్‍ను కలిసినప్పుడు ఆయన ఈ విషయం చెప్పారు. జాతీయ సగటును మించి భారీగా ఐటీ ఎగుమతులను సాధించిన తెలంగాణ, ఇందుకు తోడ్పాటు అందించిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‍రావు, మంత్రి కేటీఆర్‍ నాయకత్వానికి హైసీయు అభినందనలు తెలిపింది.

వైరస్‍ కట్టడికి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నదని, ఈ విషయంలో ప్రభుత్వానికి ఐటీ పరిశ్రమవర్గాల నుంచి పూర్తిసహకారం అందిస్తామని వారు తెలిపారు. ప్రస్తుతం ఐటీ ఉద్యోగులకున్న పరిమితులు, ప్రభుత్వం, ఇతర అధికారవర్గాల నుంచి కావాల్సిన సహాయ సహకారాలపై మంత్రికి విజ్ఞప్తిచేశారు. ప్రస్తుత పరిస్థితులను కొత్త అవకాశాలు స•ష్టించేందు వాడు కోవాలని కేటీఆర్‍ వారికి సూచించారు. మనిషికి ఎదురవుతున్న సవాళ్లను సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఎదుర్కొనేందుకు ప్రయత్నించాలన్నారు. హైదరాబాద్‍లోని అనేక కంపెనీలు నూతన పరిష్కారాలతో ముందుకొస్తున్న పరిస్థితి కనిపిస్తున్నదని చెప్పారు. ఇలాంటి వాటికి ప్రభుత్వం తరఫున మద్దతు ఇస్తామని తెలిపారు. ఇటీవలే విహజ్‍ స్టార్టప్‍ అందుబాటులోకి తెచ్చిన ఆన్‍లైన్‍ మీటింగ్‍ సొల్యూషన్‍ను ఐటీశాఖలో అంతర్గత సమావేశాలకు వాడుకుంటున్నట్టు చెప్పారు. నూతనంగా ఎన్నికైన హైసీయా కార్యవర్గానికి కేటీఆర్‍ శుభాకాంక్షలు తెలిపారు.