No. of Views : 19
pandurangacharyalu-passed-away

ప్రముఖ ఉభయవేదాంత పండితులు కొడిచెర్ల పాండురంగాచార్యులు(102) హైదరాబాద్‍లో కన్నుమూశారు. ఆయన వేదశాస్త్ర పారంగతులు, సంస్కృత, సాహిత్య విద్వన్యులు, సలక్షణ క•ష్ణయజుర్వేద ఘనాపాఠిగా పేరెన్నిక గన్నారు. ఆయన వేములవాడలో చాలాకాలం క్రితం సంస్కృత, వేద ఉపన్యాసకులుగా పనిచేశారు. మహబూబ్‍నగర్‍కు చెందిన ఈయన సుమారు 20 ఏండ్లపాటు మైసూరుకు చెందిన పరకాల మఠ 33వ జీయర్‍స్వామి శ్రీఅభినవ రంగనాథ బ్రహ్మతంత్ర స్వతంత్ర జీయర్‍స్వామి వద్ద వేదశాస్త్ర అధ్యయనం చేశారు. రంగాచార్యుల మృతి పట్ల సీఎం కేసీఆర్‍ సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.