No. of Views : 16
al-qaeda-financier-from-telangana-mohd-zubair-deported-to-india-after-60-months-in-us-jaik

ఆల్‍ఖైదా ఉగ్రవాది మహమ్మద్‍ జుబెర్‍ను పోలీసులు హైదరాబాద్‍ తీసుకొచ్చారు. అల్వాల్‍లోని తన నివాసానికి జుబెర్‍ను తరలించారు. 2016లో అమెరికా అధికారులు జుబెర్‍ను అరెస్టు చేశారు. అమెరికా నుంచి 16 రోజుల క్రితం అతడిని భారత్‍కు పంపించారు. 14 రోజులపాటు అమృత్‍సర్‍లో క్వారంటైన్‍లో ఉంచారు. క్వారంటైన్‍ పూర్తి కావడంతో హైదరాబాద్‍కు తీసుకువచ్చారు. అల్‍ఖైదాకు నిధులు సేకరించారన్న ఆరోపణలపై జుబెర్‍ అరెస్టయ్యారు. జుబెర్‍ ఫోన్‍ కాంటాక్టులు, సోషల్‍ మీడియా కదలికలపై పోలీసులు దృష్టి సారించారు.