No. of Views : 16
Chicago experiences most violent Memorial Day weekend in five years

చికాగోలో మెమోరియల్‍ డే వీకెండ్‍లో ఘోర విషాదం చోటుచేసుకుంది. దుండగులు జరిపిన  కాప్పుల్లో తొమ్మిది మంది మరణించగా, 27 మంది గాయాలయ్యాయి. 2015 నుంచి పోల్చుకుంటే ఇది దారుణమైన ఘటన అని స్థానిక మీడియా చికాగో ట్రిబ్యూన్‍ వెల్లడించింది. శుక్రవారం మధ్యాహ్నం నుంచి సోమవారం ఉదయం వరకూ మొత్తం 36 మందిపై కాల్పులు జరిగాయని తెలిపింది. సుదీర్ఘ వీకెండ్‍లో ఇంకా ఒక రోజు మిగిలి ఉందని, కరోనా వైరస్‍ నేపథ్యంలో స్టే ఎట్‍ హోం నిబంధనలు, శనివారం నాటి పోలీసుల గస్తీ ఉన్నప్పటికీ కాల్పులు సంఖ్య 2019 మొత్తానికి చేరుకుంటోందని తెలిసింది. 2019లో మెమోరియల్‍ వీకెండ్‍లో 43 మందిపై కాల్పులు జరగ్గా, ఏడుగురు మరణించారు. అదేవిధంగా 2016లో 69 మందిపై కాల్పులు జరగ్గా ఆరుగురు మృతి చెందారు. 2015లో 12 మంది మరణించారని వెల్లడించింది.