No. of Views : 21
Minister Srinivas Goud Press Meet

తెలంగాణ పెట్టుబడులకు స్వర్గధామంగా మారిందని, దేశీయ, విదేశీ సంస్థలు పెద్దఎత్తున రాష్ట్రంలో పరిశ్రమలను స్థాపించాయని రాష్ట్ర క్రీడలశాఖ మంత్రి శ్రీనివాస్‍గౌడ్‍ తెలిపారు. కరోనా అనంతరం రాష్ట్రంలో ఇదే ఒరవడి కొనసాగుతుందని అన్నారు. బీజేపీ ఎంపీ అర్వింద్‍ పారిశ్రామికవేత్తలను భయపెట్టే ధోరణిలో మాట్లాడడం దారుణమని, బీజేపీ నాయకత్వం దీనిపై స్పందించాలని కోరారు. పసుపు బోర్డు లేకపోతే రాజీనామా చేస్తానని బాండ్‍ రాసిచ్చిన అరవింద్‍ తొలుత ఆ హామీ ఏమైందో చెప్పాలన్నారు.