No. of Views : 10
TDP Mahanadu Starts

తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద పండుగలా భావించే మహానాడు ప్రారంభమైంది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కేంద్ర కార్యాలయంలో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు.  ఉభయ తెలుగు రాష్ట్రాలు, విదేశాల్లోని పార్టీ ఎన్‍ఆర్‍ఐ విభాగానికి చెందిన నాయకులు, కార్యకర్తలు సుమారు 14 వేల మంది జూమ్‍ యాప్‍ ద్వారా భాగస్వాములయ్యారు. యూట్యూబ్‍, ఫేస్‍బుక్‍ లైవ్‍ ద్వారా మరో 10 వేల మంది కార్యక్రమాన్ని వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. ఒక రాజకీయ పార్టీ, ఇన్ని వేల మంది నాయకుల్ని, కార్యకర్తల్ని భాగస్వాముల్ని చేస్తూ ఆన్‍లైన్‍లో ఇలాంటి కార్యాక్రమం నిర్వహించడం దేశంలో ఇదే మొదటిసారి. ఏటా జరిగే ఈ వేడుకను కరోనా కారణంగా ఈసారి డిజిటల్‍ మాధ్యమం ద్వారా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు యనమల రామకృష్ణుడు, చిన రాజప్ప, నారా లోకేశ్‍, అయ్యన్నపాత్రుడు, దేవినేని ఉమా మహేశ్వరరావు, సోమిరెడ్డి చంద్రమోహన్‍ రెడ్డి, బోండా ఉమా తదితరులు పాల్గొన్నారు.