No. of Views : 17
US to take action against China over Hong Kong this week says Trump

ప్రపంచ దేశాలను సంక్షోభంలోకి నెట్టిన కరోనా వైరస్‍కు కారణమైన చైనాపై ఇప్పటికే అమెరికా గుర్రుగా ఉంది. ఈ విషయంలో చైనాపై చర్యలు తప్పవని పలుమార్లు సృష్టం చేసింది. అయితే తాజాగా హాంకాంగ్‍ విషయంలో మాత్రం చైనాపై చర్యలకు సిద్ధమైనట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‍ ప్రకటించారు. అవి ఈ వారం చివర్లోనే ఉంటాయని సృష్టం చేశారు. వైట్‍హౌజ్‍లో జరిగిన విలేకరుల సమావేశంలో ట్రంప్‍ పూర్తి వివరాలు వెల్లడించనప్పటికీ ఈ వారంలో చివర్లో ప్రకటించే చర్యలు చాలా శక్తిమంతంగా, ఆసక్తికరంగానూ ఉంటాయని అన్నారు.