No. of Views : 16
Coronavirus Positive Cases in Telangana

తెలంగాణలో బుధవారం ఒక్కరోజే 107 కరోనా పాజిటివ్‍ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్‍ కేసుల సంఖ్య 2,098కి చేరింది. గత 24 గంటల్లో ఆరుగురు కరోనాతో మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 63కు చేరుకుంది. కొత్తగా నమోదైన 107 కేసుల్లో తెలంగాణ నుంచి 39 మంది, వలసదారులు 19 మంది, సౌదీ అరేబియాలో ఖైదీలుగా ఉంటున్న బిహార్‍, ఉత్తరప్రదేశ్‍ తదితర రాష్ట్రాలకు చెందినవారు 49 మంది ఉన్నారని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‍ శ్రీనివాసరావు తెలిపారు. ఇప్పటివరకు 1,321 మంది డిశ్చార్జి అయ్యారని వివరించారు. ప్రస్తుతం 714 మంది చికిత్స పొందుతున్నారన్నారు.