No. of Views : 22
Coronavirus Positive Cases in AP

ఆంధప్రదేశ్‍లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజురోజుకీ పెరిగిపోతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 85 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తాజా బులిటెన్‍లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 3,330కి చేరింది. తాజాగా నమోదైన కేసుల్లో 33 మంది రాష్ట్రంలోని వారు కాగా, మిగతా కేసులన్నీ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినవారుగా పేర్కొంది. ఇప్పటివరకు విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిలో 11 మందికి కరోనా నిర్ధారణ కాగా.. పలు రాష్ట్రాల నుంచి వచ్చిన 345 మంది వలస కార్మికులకు ఈ  మహమ్మారి సోకినట్లు వివరించింది. తాజాగా మరొకరు మృతిచెందడంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 60కి చేరింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 2,037 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం 777 మంది చికిత్స పొందుతున్నారని తెలిపింది.