No. of Views : 19
trump-bans-entry-of-certain-categories-of-students-from-china

అమెరికాలోని చైనా విద్యార్థులపై ఆంక్షలు విధిస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‍ చేసిన హెచ్చరికను డ్రాగన్‍ దేశం తప్పుపట్టింది. ఇది జాతిపరమైన అహంకారం, కమ్యూనిస్టు వ్యతిరేకతకు నిదర్శనమని విమర్శించింది. చైనా సైన్యం, గూఢచారి విభాగాలకు అనుబంధంగా ఉన్న సంస్థల్లో చదివిన విద్యార్థుల వీసాలను రద్దు చేయాలంటూ కొంతకాలం క్రితం అధికారులు చేసిన ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు ట్రంప్‍ ప్రకటించారు.