No. of Views : 18
donald-trump-twitter-feud-blocked-message-social-media-executive-order

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‍నకు సామాజిక మాధ్యమం ట్విట్టర్‍ సంస్థ గట్టి ఝులక్‍ ఇచ్చింది. మిన్నేసోటా రాష్ట్రంలో ఆందోళనకారులను కాల్చిపారేస్తామని ఆయన చేసిన ట్వీట్‍ను బ్లాక్‍ చేసింది. సోషల్‍ మీడియా కంపెనీలపై నియంత్రణకు సంబంధించిన కార్యనిర్వాహక ఉత్తర్వులపై ట్రంప్‍ సంతకం చేసిన గంటల తర్వాతనే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. హింసను ప్రేరేపించేలా ఉండే ట్వీట్లకు సంబంధించి ఉన్న నిబంధనల ప్రకారం ట్రంప్‍ చేసిన ఈ ట్వీట్‍ను ట్విట్టర్‍ నోటీస్‍తో బ్లాక్‍ చేసింది. నోటీసును క్లిక్‍ చేయడం ద్వారా ట్వీట్‍ను చూడొచ్చని, అది ప్రజల ఇష్టమని పేర్కొంది.