No. of Views : 37
AP govt released fresh guidelines to lockdown relaxation

ఆంధప్రదేశ్‍ రాష్ట్ర ప్రజలకు గుడ్‍న్యూస్‍. ప్రభుత్వం మరికొన్ని లాక్‍డౌన్‍ సడలింపులు ఇచ్చింది. ప్రజలకు మరికొన్ని మినహాయింపులు ప్రకటించింది. ఆంధప్రదేశ్‍ పరిధిలో ప్రజారవాణా వాహనాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆటోలు 1+2, కార్లు 1+3, మిని వ్యాన్లు 50 శాతం ప్రయాణికులను చేరవేసేందుకు అనుమతి ఇచ్చారు. కంటైన్మెంట్‍ జోన్లు మినహా ఇతర ప్రాంతాల్లో ప్రయాణికులకు మాత్రమే అనుమతినిచ్చింది. కానీ కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందే. ఇక హైదరాబాద్‍ నుంచి వచ్చే వారిని తీసుకువచ్చేందుకు తెలంగాణ నుంచి అనుమతి లేదని రాష్ట్ర కోవిడ్‍ టాస్క్ఫోర్స్ అధికారి కృష్ణబాబు తెలిపారు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ప్రభుత్వాల నుంచి అనుమతి రాగానే బస్సులు నడుపుతామన్నారు.