No. of Views : 26
Forbes drops Kylie Jenner from billionaire list

ఫోర్బస్  మేగజైన్‍ బిలియనీర్ల జాబితా నుంచి అమెరికన్‍ టీవీ రియాలిటీ స్టార్‍ కెయిలీ జెన్నర్‍ స్థానం కోల్పోయింది. స్వయంకృషితో ఎదిగిన యువ బిలియనీర్‍గా గతేడాది గుర్తింపుపొందిన సదరు అందాల తార తాజాగా ఫోర్బస్ నుంచి విమర్శలు ఎదుర్కొంటోంది. కెయిలీ కుటుంబం అబద్ధాల గూడు అల్లుతోందనీ.. 22 ఏళ్ల ఆమె తన వ్యాపారాన్నీ, విజయాలను పెంచి చూపించారని ఫోర్బస్ ఆరోపించింది. ఆమె సంపద కేవలం 900 మిలియన్‍ డాలర్లు మాత్రమే ఉన్నట్టు తమ రివ్యూలో తేలిందని  ఫోర్బస్ తెలిపింది.