No. of Views : 42
chevireddy bhaskar reddy review meeting on swarnamukhi

స్వర్ణముఖి పరివాహక ప్రాంతాన్ని ప్రక్షాళన చేయాలని, సహజ వనరుల పరిరక్షణ చేపట్టాలని ఇరిగేషన్‍, రెవెన్యూ అధికారులకు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‍ రెడ్డి సూచించారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోభివృద్ధి పై ఎమ్మెల్యే చెవిరెడ్డి తుమ్మలగుంటలోని తన కార్యాలయంలో ఇరిగేషన్‍, రెవెన్యూ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చెవిరెడ్డి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. సహజ జల వనరులు కాలువలు, చెరువుల పరిరక్షణ బాధ్యతలు చేపట్టాలన్నారు. స్వర్ణముఖి పరిరక్షణకు పక్కాగా సర్వే నిర్వహించాలని సూచించారు. ఇందుకు ఇరిగేషన్‍, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా నిర్వహించాలని తెలిపారు. అలాగే నియోజక వర్గంలో చేపట్టే అభివృద్ధి పనుల పురోభివృద్ధి పై ఇరిగేషన్‍ విభాగం అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశంలో తిరుపతి రెవెన్యూ డివిజన్‍ డిప్యూటీ కలెక్టర్‍ కనకనరసా రెడ్డి, డీ ఈ లు శివ రామిరెడ్డి, వెంకట ప్రసాద్‍ తదితరులు పాల్గొన్నారు.