No. of Views : 14
https://www.kMahesh Babu s New film Titled Sarkari Vari Pata

సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు...

ఇస్టాగ్రామ్ లో సాయంత్రం మహేష్ తో చిట్ చాట్....

మహేష్ 27 వ చిత్రం 'సర్కారు వారి పాట' టైటిల్ ప్రకటన.....

టాలీవుడ్‌ సీనియర్‌ సూపర్‌స్టార్‌ కృష్ణ ఘట్టమనేని మే 31 జన్మదినం నేడు. ఈ సందర్భంగా ఘట్టమనేని ఫ్యాన్స్‌, టాలీవుడ్‌ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా సూపర్ స్టార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు తన తండ్రికి బర్త్‌డే విషెస్‌ తెలుపుతూ ట్వీట్‌ చేశారు. ‘మీకు ఎప్పటికీ రుణపడే ఉంటాను. ఎప్పటికీ మీరే నా సూపర్‌ స్టార్‌. హ్యాపీ బర్త్‌డే నాన్న’ అంటూ ట్వీట్‌ చేశారు. అంతేకాకుండా తన తండ్రితో తను చిన్నప్పుడు దిగిన ఫోటోను కూడా అభిమానులతో పంచుకున్నారు మహేశ్‌. మహేశ్‌తో పాటు నమ్రతా శిరోద్కర్‌, సితారలు కూడా ఇన్‌స్టాలో కృష్ణకు ప్రత్యేక జన్మదిన శుభాకంక్షలు తెలిపారు.

తన తండ్రి కృష్ణ బర్త్‌డే సందర్భంగా మహేశ్‌ ఈ రోజు సాయంత్రం సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించనున్నారు. ఈ సందర్భంగా ఇన్‌స్టాలో సాయంత్రం 5 గంటలకు క్వశ్చన్‌ అండ్‌ ఆన్సర్‌ సెషన్‌ జరుగ బోతుంది. అంతేకాకుండా ఈ లైవ్‌ చాట్‌లో తన సినిమాలు, కుటుంబం గురించి ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక కృష్ణ బర్త్‌డే రోజే కనుక గత ఏడాది సరిలేరు నీకెవ్వరూ పోస్టర్ రిలీజ్ చేసారో ఈ ఏడాది కూడా మహేశ్‌ 27వ చిత్రం 'సర్కారు వారి పాట' ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. దీనికి సంభందించిన పోస్టర్ ఈ రోజు ఉదయం 9 ఘంటలకు విడుదలచేశారు. దీంతో ఈరోజు మహేశ్ ఫ్యాన్స్‌కు పండగే పండగ. ఈ చిత్రాన్ని పరుశురాం దర్శకత్వం వహిస్తుండగా మైత్రీమూవీమేకర్స్‌ నిర్మించబోతోంది. జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, 14 రీల్స్‌ సంస్థలు కూడా ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామ్యం వహిస్తాయి.