No. of Views : 48
NATS support to movie workers item held in Hyderabad

సినిమాల నిర్మాణం లాక్‌డౌన్ ప్రభావంతో ఆగిపోవడంతో సినీ కార్మికులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి వారికి కూడా ఉత్తర అమెరికా తెలుగుసంఘం నాట్స్ చేయూత అందించింది. నాట్స్ బోర్డు ఛైర్మన్ శ్రీథర్ అప్పసాని చొరవతో సినీ కార్మికులకు నాట్స్ సాయం చేసింది. దాదాపు 34 కుటుంబాలకు నాట్స్ తరపున నిత్యావసరాలను పంపిణీ చేశారు. ఈ కష్టకాలంలో తమను కూడా గుర్తించి ఆదుకున్నందుకు సినీ కార్మికులు నాట్స్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా నాట్స్ చైర్మన్ శ్రీధర్ అప్పసాని మరియు నాట్స్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మంచికలపూడి మాట్లాడుతూ నాట్స్ సంస్థ ఎల్లపుడు ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మన తెలుగు వారికి అండగా ఉంటుందని తెలిపారు. అభ్యుదయ సినీ రచయిత లీలా సుభ్రహ్మణ్యం కార్మికుల కష్టాన్ని గమనించి నాట్స్ దృష్టి కి తీసుకువచ్చారు.

ఈ సందర్భంగా నాట్స్ చైర్మన్ శ్రీధర్ అప్పసాని మరియు నాట్స్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మంచికలపూడి మాట్లాడుతూ నాట్స్ సంస్థ ఎల్లపుడు ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మన తెలుగు వారికి అండగా ఉంటుందని తెలిపారు.