No. of Views : 10
Britain and U.S. ban most electronic devices in cabins on flights

విమాన క్యాబిన్లలో ఎలక్ట్రానికి వస్తువులను తరలించడంపై అమెరిక నిషేదం విధించింది. మిడిల్‌ ఈస్ట్‌, ఉత్తర ఆఫ్రిక దేశాలకు చెందిన ఎనిమిది ముస్లిం దేశాలకు వెళ్లే విమానాల్లో ఈ నిషేధం అమలులో ఉండనున్నట్లు అమెరికా తెలిపింది. ఈ నిబంధనలను వెంటనే అమలు చేయాలని అమెరికాకు విమానాలు నడిపే సంస్థలకు సూచించింది. అయితే ఈ నిషేధం ఎలాంటి కాలపరిమితి లేదని అక్కడి అధికారులు సృష్టం చేశారు. ప్రయాణికుల వద్ద స్మార్ట్‌ ఫోన్‌కు మించి ఎలాంటి ఎలక్ట్రానిక్‌ వస్తువుల రవాణ కుదరదని తేల్చి చెప్పింది. ల్యాప్‌టాప్‌లు, ఐపాడ్‌లు, కిండిల్‌ లాంటి ఎలక్ట్రానిక్‌ వస్తువులు కూడా అనుమతించేది లేదని అధికారులు తెలిపారు. ఉగ్రవాదులు ఎలక్ట్రానిక్‌ వస్తువుల ద్వారానే పేలు పదార్థాలు అమెరికాకు సరఫరా చేస్తున్నారనీ, దీంతో భద్రతా కారణాల దృష్ట్య ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. దీంతో 10 ఏర్‌పోర్టుల నుంచి అమెరికాకు వెళ్లే 50 విమానాల్లో ఈ ఆంక్షలు ఉండనున్నాయి. అయితే  విమానన సిబ్బందికి మాత్రం ఇందులో  మినహాయింపునకు ఇచ్చారు. మరో 96 గంటల్లో ఈ నిబంధనలు అమలు చేయాలని సూచించారు. అయితే ఈ నిషేధం విధించిన మార్గాల్లో అమెరికా ఎలాంటి విమాన సర్వీసులను నడపడం లేదు.